నవతెలంగాణ-హైదరాబాద్: టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులపై జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి కేవలం ఫాస్ట్‌టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులను స్వీకరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల్లో పూర్తిగా నగదు లావాదేవీలను నిలిపివేసి, పూర్తి స్థాయి డిజిటల్ నేషనల్ హైవే టోలింగ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. టోల్ వసూళ్లలో పారదర్శకత, సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా ఈ మార్పును తీసుకొనిరానున్నట్లు సంస్థ వివరించింది. గత కొద్ది సంవత్సరాలుగా టోల్ వసూళ్లలో 98ు ఫాస్ట్‌టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. జాతీయ రహదారుల రుసుము నిబంధనల ప్రకారం ఇప్పటి వరకూ… ఉనికిలో లేని ఫాస్ట్‌టాగ్‌తో లేదా అసలు లేకుండా టోల్ ప్లాజా దాటాలనుకునే వాహనదారులు నిర్దేశిత రుసుముకు రెండింతలు సొమ్ము చెల్లించాలి. అదే యూపీఐ ద్వారా అయితే నిర్దేశిత ఫీజుపై 1.25 రెట్లు చెల్లిస్తే సరిపోతుంది.
టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులపై కీలక అప్‌డేట్
- Advertisement -
- Advertisement -



