– 185 మంది విద్యార్థులకి నీటి కటకట
నవతెలంగాణ-ఆలేరు టౌన్ : ఆలేరు పట్టణంలోని ప్రైమరీ పాఠశాలలో గత మూడు రోజుల నుండి విద్యార్థులకు నీటి సమస్య తీవ్రతరమైంది. రెగ్యులర్ గా వచ్చే మిషన్ భగీరథ మంచినీరు పైప్ లైన్ పగిలిన కారణంగా గత మూడు రోజుల నుండి త్రాగునీరు ఇతర అవసరాల కొరకు నీరు రావడం లేదు.
సమస్యను ఉపాధ్యాయులు బుధవారం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాగా మేనేజర్ జగన్మోహన్ విద్యార్థుల అవసరార్థం ట్యాంకర్ లో నీరు పంపించారు. మున్సిపల్ నుండి మంచినీరు వచ్చినప్పటికీ, సరిపడ నీరు పోయకుండానే మున్సిపల్ సిబ్బంది వెళ్ళిపోయారని ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు వాపోయారు.
ప్రైమరీ స్కూల్ కు గత మూడు రోజుల నుండి మిషన్ భగీరథ మంచినీరు రాకపోవడంతో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు త్రాగు నీటితో పాటు కాల కృత్యాలకు ఇతర నిత్యవసరాల కొరకు దాదాపు 1000 లీటర్లతో కూడిన ఒక ట్యాంకర్ నీరు అవసరం పడుతుంది. నీటి సమస్య తలెత్తడంతో గత మూడు రోజుల నుంచి అటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ప్రైమరీ పాఠశాలలో185 మంది విద్యార్థుల అవసరాల దృష్ట్యా వెంటనే నీటి సమస్యను మున్సిపల్ అధికారులు పరిష్కరించాలని ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు.



