Monday, August 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళ్యాణ లక్ష్మి పథకం నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరం

కళ్యాణ లక్ష్మి పథకం నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరం

- Advertisement -

వార్డు సభ్యులు సుభాష్ కొండావార్
నవతెలంగాణ-మద్నూర్

ప్రజా పాలన ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరం లాంటిదని వార్డు సభ్యుడు సుభాష్ కొండవార్ తెలిపారు. మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామానికి మంజూరైన కళ్యాణ లక్ష్మి పథకం చెక్కు సోమవారం మద్నూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ చేతుల మీదుగా ఆయన లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరం లాంటిదని పేర్కొన్నారు .కల్యాణ లక్ష్మి చెక్కు మంజూరు కావడంతో లబ్ధిదారుని కుటుంబం ప్రజా పాలన ప్రభుత్వానికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు గ్రామ సర్పంచుకు వార్డు సభ్యులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -