Thursday, June 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆటిట్యూడ్‌కు ప్రతీకగా ‘ఆల్ఫా’

ఆటిట్యూడ్‌కు ప్రతీకగా ‘ఆల్ఫా’

- Advertisement -

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆల్పా’. అలియా భట్, షర్వారిలతో భారీ బడ్జెట్ యాక్షన్ మూవీని రూపొందించారు. ఈ చిత్రం ఆటిట్యూడ్‌కు ఒక వేడుకగా, ప్రతీకగా నిలిచే ఓ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ మూవీ షూటింగ్, అందులోని క్షణాల్ని తాను ఎప్పటికీ మర్చిపోలేను అని అలియా భట్ అన్నారు. ఆమె మాట్లాడుతూ,’ఈ చిత్రానికి పని చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. నేను ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. యాక్షన్, గ్రాండి యర్, అడ్వెంచర్‌లతో కూడిన ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. ఇది నేను మునుపెన్నడూ అనుభవించని ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్. షూటింగ్‌లోని ప్రతీ క్షణాన్ని నేను ఎంతో ప్రేమించాను, ఆస్వాదించాను. ఈ చిత్రంలోని కథ ఇద్దరు మహిళ కథానాయికల చుట్టే తిరుగుతుంది. అదే నాకు ఎక్కువగా నచ్చిన అంశం. ఇలాంటి గొప్ప స్క్రిప్ట్‌లు మనం అరుదుగా చూస్తుంటాం’ అని అన్నారు. ఆదిత్య చోప్రా నిర్మాణంలో ‘ది రైల్వే మెన్’ ఫేమ్ శివ్ రావైల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -