Wednesday, June 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకళాకారుల ప్రోత్సాహానికి సరైన వేదిక

కళాకారుల ప్రోత్సాహానికి సరైన వేదిక

- Advertisement -

విబి ఎంటర్టైన్మెంట్స్ 8వ ఫిలిం, టీవీ డైరెక్టరీ, డిజిటల్ మీడియా అవార్డ్స్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. విష్ణు బొప్పన నిర్వహించిన ఈ వేడుకలో కెఎస్ రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ్, అంబికా కృష్ణ, మాదాల రవి పాల్గొని, అవార్డులను అందచేశారు.అన్విత గ్రూప్, ఎన్సిడీ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, లైట్ హౌస్ సినీ మ్యాజిక్, వివికె హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సెల్ బే మొబైల్స్, ముకుంద జెవెల్లెర్స్, శ్రీ భారతి గ్రూప్, అంబికా దర్బార్బత్తి, పొట్ల గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మయూరి ఫ్యామిలీ రెస్టారెంట్, శ్రీ అండ్ శ్రీమతి స్వప్న శ్రీనివాస్ తదితర స్పాన్సర్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ఫిలిం, టివి, డిజిటల్ & సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందిన వారికి అవార్డులను బహూకరించారు. ఈ సందర్భంగా మాదాల రవి మాట్లాడుతూ, ‘సినిమా, టీవీ, సోషల్ మీడియా సమాజాన్ని చైతన్యవంతం చేసే శక్తివంతమైన సాధనాలు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నిజమైన సమాచారం, సామాజిక అవగాహన అందించాలి. అవాస్తవ ప్రచారాలకు దూరంగా ఉండి, సమా జంలో మంచి మార్పులు తీసుకురావడానికి సోషల్ మీడియాను ఉపయోగించాలి. కళాకారులను ప్రోత్సహిస్తూ సేవా కార్య క్రమాలు నిర్వహిస్తున్న విష్ణు బొప్పనను అభినందిస్తున్నానుఅని తెలిపారు. 'ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, అవార్డు గ్రహీతలు, మీడియా ప్రతినిధులు, స్పాన్సర్లందరికీ కృతజ్ఞతలు. డిజిటల్ మీడియా అవార్డులకు మంచి స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్స ర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఏటా మీడియా రంగంలో విశేష ప్రతిభను కనబరుస్తూ, సమాజానికి ఉపయోగపడుతున్న ప్రతిభావంతులను ఎంపిక చేసిన ఈ అవార్డులను అందించడం చాలా సంతోషంగా ఉంది అని బొప్పన విష్ణు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -