Wednesday, June 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమహేష్ బాబు ఆశ్చర్యపోయారు

మహేష్ బాబు ఆశ్చర్యపోయారు

- Advertisement -

సత్యదేవ్ హీరోగా రూపొందిన చిత్రం రావు బహదూర్. వెంకటేష్ మహా దర్శకుడు. దీనికి మహేష్ బాబు, నమ్రత సమర్పకులు. చింతాగోపాల కృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన ఈ సినిమా జూలై 3న విడుదల కానుం ది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన చింతా గోపాల కృష్ణరెడ్డి మీడియాతో ముచ్చటించారు. ‘రావు బహదూర్ ` కథను మొదట నమ్రత విన్నారు. ఈ కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. నేను భిన్నమైన సినిమాలు చేయాలను కోవడం వల్లే అనురాగ్, శరత్ ఈ కథతో నా వద్దకు వచ్చారు. ‘రావు బహదూర్` పాత్రకు సత్య దేవ్ పర్ఫెక్ట్‌గా సరిపోయారు. మహేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పించడంతో ‘రావు బహ దూర్’ అనే పేరుకే ఒక ప్రత్యేకమైన గౌరవం వచ్చింది. ఆయన పేరు వినగానే ప్రేక్షకుల్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడుతుంది. కథ, సెట్స్, కాస్ట్యూమ్స్, నిర్మాణ విలువలు చూస్తే ‘బాహుబలి` తరహా భారీ నిర్మాణ అనుభూతి కలుగుతుంది. మేము చెప్పాలను కుం టున్నది అదే. నిర్మాణ పరంగా ఆ స్థాయి నాణ్యతతో ఈ చిత్రాన్ని రూపొందించాం. వెంకటేష్ మహా ఎంతో గొప్ప విజన్‌తో ఈ సినిమాను తెరకెక్కిం చారు. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి మేకింగ్‌తో కూడిన సినిమా ఇప్పటివరకు రాలేదు. ప్రతి పాత్రను ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేశారు. రిలీజ్‌కు ముందే ఓటీటీ, ఓవర్సీస్ బిజినెస్ పూర్తయింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. మహేష్ బాబు సినిమా చూసి చాలా ఆశ్చర్యపోయారు. 24 క్రాఫ్ట్స్‌ లోనూ అద్భుతంగా వచ్చిందని ప్రశంసించారు. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదని చెప్పడం మరింత నమ్మకాన్ని ఇచ్చింది.వినాయక చవితికి ఒక సినిమా, దసరాకు మరో సినిమా మా బ్యానర్ నుంచి రానున్నాయి. వీటి వివరా లను త్వరలోనే తెలియజేస్తాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -