Wednesday, June 24, 2026
E-PAPER
Homeజాతీయంయూపీలో ఉన్నతాధికారి అవినీతిని ప్రశ్నించిన కార్మికుడు

యూపీలో ఉన్నతాధికారి అవినీతిని ప్రశ్నించిన కార్మికుడు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ యోగి పాలనలో అవినీతి అధికారులు బరితెగించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పట్ల అవమానీయంగా వ్యవహరించారు. నెలంతా కష్టపడి సంపాదించిన కొద్ది జీతంలో సదరు అధికారి కమీషన్ పేరుతో కాజేశాడు. యూపీ వైద్యశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు.. ఉన్నతాధికారిపై తిరగబడిన వీడియో వైరల్ అవుతోంది.నెలకు 13 వేల రూపాయలు ఇస్తామని కాంట్రాక్టు కుదుర్చుకొని రూ.7500 లు  చేతులో పెడితే తనకు జరిగిన అన్యాయం, అధికారుల దోపిడీపై   కార్మికుడు ఆగ్రహాం వ్యక్తం చేశాడు. గాజులు, లంగా తీసుకొచ్చి  వేసుకొని అధికారికి బహుమతిగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో బీజేపీ పాలనలో అవినీతికి హద్దు లేకుండ పోయిందని, లక్షల్లో జీతాలు తీసుకునే ఉన్నతాధికారులు చిరు ఉద్యోగుల శ్రమను, కష్టార్జితాన్ని దోపిడీ చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -