- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ : యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని పలు పాఠశాలలో క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. మదర్ థెరిస్సా హై స్కూల్, శాంభవి హై స్కూల్, కృష్ణవేణి హై స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ, కిసాన్ నగర్, ఆదర్శ పాఠశాలలలో కాంపిటీషన్ నిర్వహించారు. . డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు వాటి దుష్ప్రభావాలపైన కాంపిటేషన్ నిర్వహించడం జరిగిందని బాల్కొండ ఎస్ఐ శైలేందర్ తెలిపారు.ఈ కాంపిటీషన్లో దాదాపు 900 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



