- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్ : తెలంగాణ రాష్ట్ర పోలీస్ ప్రధాన అధికారి(డిజిపి)గా పదవి బాధ్యతలు స్వీకరించిన సి.వి. ఆనంద్ ఐపీఎస్ ను టీఎన్జీవో కేంద్ర సంఘం పక్షాన తెలంగాణ రాష్ట్ర డిజిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ టి ఎన్జీవోఎస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టి ఎన్ జి ఓ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ఎం.హుస్సేనీ (ముజీబ్), టీఎన్జీవోఎస్ రాష్ట్ర సహాధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ గౌడ్, ఎంప్లాయిస్ జేఏసీ నిజామాబాద్ జిల్లా జిల్లా చైర్మన్, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ లు ఉన్నారు.
- Advertisement -



