Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే సునీత 

బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే సునీత 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేర్ పట్టణంలో సోమవారం రహదారి బంగ్లాలో, మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే,గొంగిడి సునీత  మహేందర్ రెడ్డి, బిఆర్ ఎస్, మున్సిపల్ కౌన్సిలర్లుగా నూతనంగా ఎన్నికైన, పాకాల మౌనిక హరీష్, యాట శివ, బీజని కళ్యాణి మధులను ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. వార్డుల అభివృద్ధి కొరకు కృతనిచ్చేయంతో పనిచేయాలని సూచించారు.

ఈ  కార్యక్రమంలో ఆలేరు పట్టణ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి వెంకటేష్ గౌడ్,మాజీ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గాదపాక నాగరాజు,  మాజీ కౌన్సిలర్ బీతి రాములు,పాషికంటి శ్రీనివాస్, కుతాటి అంజన్, మాజీ కోఆప్షన్ సభ్యులు సీస రాజేష్ గౌడ్, వార్డు అధ్యక్షులు సీస సత్తయ్య గౌడ్, ఎండి ఫయాజ్, ఆంజనేయులు, మురిగాడి సుజాత, టింకు, బెదరకోట దుర్గేష్ ,దుడక గణేష్, గట్టు శ్రీను, పట్టణ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -