- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వెనిజులాలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.9గా నమోదైంది. రెండు రోజుల క్రితం వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాల ధాటికి దేశంలో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. ఈ విపత్తులో 920 మంది మృతి చెందగా, 3 వేల మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయి ఉండొచ్చనే అనుమానంతో సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. తాజా భూకంపంతో ప్రజల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి.
- Advertisement -



