Sunday, June 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంశిథిలాల్లో చిగురించిన ఆశ

శిథిలాల్లో చిగురించిన ఆశ

- Advertisement -

మరోసారి భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్ పై 4.9 గా 
తీవ్రత నమోదు
మృత్యువును జయించిన 18 రోజుల పసిప్రాణం 


వెయ్యి కి చేరిన మృతుల సంఖ్య.. 50 వేలకు పైగా మిస్సింగ్
కార్కస్ :
కొన్ని సెకన్ల విలయం.. ఎన్నో కుటుంబాల భవిష్యత్ ను చిదిమేసింది. అదే సమయంలో.. ఓ కన్నతండ్రి గుండె మాత్రం మళ్లీ కొట్టుకుంది. తల్లి కౌగిలి లేకపోతే క్షణం ఉండలేని పసికందు.. శిథిలాల అడుగున పడిపోయింది. చివరకు సజీవంగా కనిపించి.. వెనిజులా పెనువిపత్తులో మృత్యువును జయించింది. ఆ చిన్నారిని బయటకు తీస్తున్నప్పుడు వినిపించిన కేరింతలు ఆ ప్రాంతాన్ని ఉద్విగ్నంగా మార్చాయి.
వెనిజులో బుధవారం సాయంత్రం క్షణాల వ్యవధిలో జంట భూకంపాలు రావడంతో వందల భవనాలు కుప్పకూలాయి. దాంతో వేలాదిమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఓ ప్రాంతంలో 18 రోజుల పసికందు తల్లితో సహా శిథిలాల కింద చిక్కుకుపోయింది. తన భార్యబిడ్డ అసలు బతికున్నారో లేదో తెలియక వారికోసం వెతుకుతూ తండ్రి తల్లడిల్లాడు. అక్కడ రెస్క్యూ సిబ్బంది ఒక్కో సిమెంట్ దిబ్బను తొలగిస్తుంటే.. ఆ తండ్రి గుండె వేగంగా కొట్టుకోసాగింది.

చివరకు ప్రయత్నం ఫలించి రోజుల బిడ్డ ప్రాణాలతో కనిపించింది. ఆ బిడ్డను వస్త్రంలో చుట్టి ఎంతో అపురూపంగా తండ్రికి అందించడంతో ఆయన గుండె మళ్లీ కొట్టుకున్నట్లయింది. చిన్నగాయం లేకుండా పాలకోసం ఎదురుచూస్తున్న ఆ బిడ్డను చూసి ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ఒకవైపు బిడ్డ దొరికిందన్న ఆనందం.. మరోవైపు భార్య పరిస్థితి ఎలా ఉందో తెలియని పరిస్థితి. చివరకు 90 నిమిషాల తర్వాత ఆ తల్లి కూడా సజీవంగా ఉందన్న వార్త వినిపించింది. దాంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. ఈ భారీ విపత్తు నుంచి ఆ కుటుంబం బయటపడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మళ్లీ వణికిన వెనిజులా
ఈ వారం ప్రారంభంలో వందలాది మంది ప్రాణాలను బలిగొన్న రెండు వినాశకరమైన భూకంపాల నుంచి ఆ దక్షిణ అమెరికా దేశం ఇంకా కోలుకోలేదు. మరోవైపు వెనిజులా ఉత్తర తీరానికి దూరంగా రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది.
బుధవారం సాయంత్రం దేశాన్ని తాకిన రెండు శక్తివంతమైన భూకంపాల తర్వాత శుక్రవారం ఈ ప్రకంపన సంభవించింది. ఆ భూకంపాలలో వెయ్యి మందికి పైగా మరణించగా, రాజధాని కారకాస్‌లోని కొన్ని ప్రాంతాలు ధ్వంసమయ్యాయి.
ఉత్తర వెనిజులాలోని మారకేకు వాయువ్యంగా 61 కిలోమీటర్ల (36 మైళ్ల) దూరంలో తాజా భూకంపం సంభవించిందని భూకంప ట్రాకర్ సంస్థ (ఈఎంఎస్ సీ )ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉన్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -