నవతెలంగాణ – కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండలంలోని చింతగూడెం గ్రామం సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్న ఘటనలో సింగారం గ్రామానికి చెందిన మహేశ్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సర్వాయి గ్రామానికి చెందిన నల్లబోయిన రాజ్‌కుమార్‌ను కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి రాజ్‌కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇద్దరికి చేరింది. ఈ విషాద ఘటనతో సింగారం, సర్వాయి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఘెర రోడ్డు ప్రమాదం..చికిత్స పొందుతూ యువకుడు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



