Monday, June 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంస్పెయిన్‌లో తెలంగాణ యువకుడి మృతి..

స్పెయిన్‌లో తెలంగాణ యువకుడి మృతి..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : స్పెయిన్‌ దేశంలోని వేలెన్సియా నగరంలో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని కూనారం గ్రామానికి చెందిన గీట్ల సాయి అఖిల్‌రెడ్డి(30) భవనంపై నుంచి ఆదివారం పడి మృతి చెందినట్లు అతడి బంధువులు తెలిపారు. కూనారం గ్రామానికి చెందిన గీట్ల సుభాషినిరెడ్డి, గుణాకర్‌రెడ్డి దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వారి ఒక్కగానొక్క కుమారుడు సాయి అఖిల్‌రెడ్డి వేలెన్సియా నగరంలో గత ఆరు నెలలుగా హోటల్‌ మేనేజ్మెంట్‌ చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కూనారంలో విషాదఛాయలు అలముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -