Monday, June 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకల్వర్టును ఢీ కొట్టిన కారు.. తండ్రి, కొడుకు మృతి

కల్వర్టును ఢీ కొట్టిన కారు.. తండ్రి, కొడుకు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి చెందారు. సిద్దిపేట పట్టణ శివారు బురుగు పల్లి వద్ద కారు వేగంగా కల్వర్టును ఢీ కొట్టింది. పోలీసుల వివరాల ప్రకారం.. మిరుదొడ్డి(M) మల్లుపల్లి గ్రామానికి చెందిన అక్కగారి సాయి (26) ఆదివారం దుబ్బాక(M) అప్పనపల్లి గ్రామంలో బంధువుల ఇంటికి ఫంక్షన్ నిమిత్తం వెళ్లాడు. రాత్రి సమయంలో కొడుకు హర్షవర్ధన్ (5) తో కలిసి సిద్దిపేటకు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -