నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో నాలుగు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 7 గంటల సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లతో పాటు.. నారాయణగిరి షెడ్లు కూడా భక్తులతో నిండిపోగా.. శిలాతోరణం వరకూ క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 18-24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. రూ.300 శీఘ్రదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 4-5 గంటల సమయం, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 5-7 గంటల వరకూ సమయం పడుతుందని పేర్కొంది. మరోవైపు అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్సులో, శ్రీవారి మెట్టు, విష్ణునివాసం, శ్రీనివాసం వద్ద ఒకరోజు ముందుగా ఇచ్చే ఉచిత సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లకై భక్తులు వేకువజాము నుంచే భారీగా బారులు తీరారు. రోజుకు 10 వేల టోకెన్లు మాత్రమే ఇస్తుండగా.. ఈ సంఖ్యను పెంచాలని భక్తులు కోరుతున్నారు.
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



