- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వానాకాలం సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతుల ఖాతాల్లో రేపు ‘రైతు భరోసా’ నిధులు జమ కానున్నాయి. రేపు ఖమ్మం జిల్లా మత్కేపల్లిలో జరిగే సభలో సీఎం రేవంత్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. జులై 15 నాటికి విడతల వారీగా రైతుల అకౌంట్లలో ఎకరానికి రూ.6వేల చొప్పున జమ కానున్నాయి. ఇప్పటికే రూ.9వేల కోట్ల నిధుల సమీకరణ పూర్తయినట్లు సమాచారం. మరోవైపు జూన్ 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జులై 5లోపు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
- Advertisement -



