Tuesday, June 30, 2026
E-PAPER
Homeజాతీయంరాజస్థాన్ లో మరో పేపర్ లీకేజ్

రాజస్థాన్ లో మరో పేపర్ లీకేజ్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: డబుల్ ఇంజన్ సర్కార్ తో విద్యార్థులకు అనేక కష్టాలు వచ్చాయి. నీట్ పరీక్ష పేపర్ లీక్, సీబీఎస్ఈ పేపర్ మూల్యాంకనంలో అవకతవకలతో మోడీ పాలనపై విద్యార్ధి లోకం ఆగ్రహాంతో ఉంది. ఇటీవలె మహారాష్ట్రంలో టెట్ పేపర్ లీక్ అయింది. ఈ ఘటనలు మరువక ముందే బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో మరో పేపర్ లీకేజ్ వెలుగు చూసింది.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (RUHS) పారామెడికల్ పరీక్షల సందర్భంగా, ఎస్ కరణ్ కళాశాల పారామెడికల్ విభాగాధిపతితో సహా నలుగురిని అరెస్టు చేశారు. పరీక్షా హాలులో మోసానికి పాల్పడేందుకు వీలుగా పర్యవేక్షకులను నియమించి, సామూహిక మోసానికి పాల్పడేలా నిందితులు పథకం పన్నారని ఆరోపణలు ఉన్నాయి.

జైపూర్ పోలీసుల ప్రకారం.. జైపూర్‌లోని ప్రభా దేవి మెమోరియల్ పీజీ కళాశాల పరీక్షా కేంద్రంలో మోసానికి పాల్పడేందుకు వీలుగా నిందితులు సుమారు 40-45 మంది అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిని ఎస్ కరణ్ కళాశాల పారామెడికల్ విభాగాధిపతి కృష్ణ కుమార్ సైని, ఎస్ కరణ్ కళాశాలలోని రేడియాలజీ విభాగంలో లెక్చరర్ అయిన శంకర్ లాల్ జాట్, ప్రభా మెమోరియల్ పీజీ కళాశాలకు చెందిన రామకృష్ణ మండివాల్, ప్రభా మెమోరియల్ పీజీ కళాశాల అడ్మినిస్ట్రేటర్ దేవకృష్ణ మండివాల్‌గా గుర్తించారు.

జూన్ 29న ప్రారంభం కానున్న RUHS పారామెడికల్ పరీక్షల సమయంలో విద్యార్థులకు సహాయం చేస్తామని వాగ్దానం చేసి ఒక ముఠా వారి నుండి డబ్బు వసూలు చేస్తోందని జూన్ 27న పోలీసులకు సమాచారం అందిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జైపూర్ వెస్ట్) ప్రశాంత్ కిరణ్ తెలిపారు. మొదటి సంవత్సరంలో బ్యాక్‌లాగ్‌లు ఉన్న అభ్యర్థులను పరీక్షలో ఉత్తీర్ణులుగా చేసేందుకు నిందితులు జైపూర్ పరీక్షా కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా, ముఠా సభ్యులను పట్టుకోవడానికి ఖోరబిసల్ పోలీస్ స్టేషన్ నుండి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -