Tuesday, June 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలునిరుద్యోగ మహిళలకు తీపి కబురు..

నిరుద్యోగ మహిళలకు తీపి కబురు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో అధికారిక నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా.. జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు జిల్లా కలెక్టర్ తీపి కబురు అందించారు. జిల్లాలోని ICDS ప్రాజెక్టుల పరిధిలో సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, గిరిజన ప్రాంతాల అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -