Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సూక్ష్మజీవుల నిరోధకతపై అవగాహన కలిగి ఉండాలి 

సూక్ష్మజీవుల నిరోధకతపై అవగాహన కలిగి ఉండాలి 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
సూక్ష్మ జీవుల నిరోధకతపై అవగాహన కలిగి ఉండాలని పట్టణంలోని బి.వి.ఆర్. స్కిన్ స్పెషలిస్ట్ వెంకటరమణ నవతెలంగాణకు తెలిపారు. జూలై 1న డాక్టకర్స్ డే సందర్భంగా ఆయన మంగళవారం నవతెలంగాణతో మాట్లాడుతూ.. ఈ సమస్య ప్రపంచ ఆరోగ్యానికి పెద్ద సవాలుగా మారిందని తెలిపారు. మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది సూక్ష్మజీవులు (బాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు, పరాన్నజీవులు) తమను నాశనం చేసే లేదా వాటి పెరుగుదలను అడ్డుకునే ఔషధాలకు (యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్, యాంటీఫంగల్స్, యాంటీపరాసిటిక్స్) వ్యతిరేకంగా నిరోధకతను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ నిరోధకత వల్ల ఔషధాలు పనిచేయకపోవడం లేదా తక్కువ ప్రభావవంతంగా మారడం జరుగుతుందని, ఫలితంగా, సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా చికిత్స చేయడం కష్టమవుతుంది, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా మరణాలు సంభవించవచ్చని తెలిపారు.

మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎలా ఏర్పడుతుంది.?
సూక్ష్మజీవులు సహజంగానే జన్యు మార్పులు (మ్యుటేషన్స్) ద్వారా లేదా ఇతర సూక్ష్మజీవుల నుండి నిరోధక జన్యువులను పొందడం ద్వారా రెసిస్టెన్స్‌ను అభివృద్ధి చేస్తాయని తెలిపారు. మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఒక పెద్ద ముప్ప అని తెలిపారు. దీనిని నియంత్రించడానికి వ్యక్తులు, వైద్య నిపుణులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని, యాంటీబయాటిక్స్‌ను బాధ్యతాయుతంగా వాడటం, పరిశుభ్రతను మెరుగుపరచడం, కొత్త ఔషధాల పరిశోధనలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ సమస్యను ఎదుర్కొనవచ్చని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -