- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలో లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈఏపీసెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తిగా వెలువడని నేపథ్యంలో, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికి ఫలితాలు రావాల్సి ఉండగా, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ, ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, సీబీఎస్‌ఈ రివైజ్డ్ ఫలితాలు పూర్తిగా వచ్చేవరకు ఆగడం వల్ల జాప్యం జరిగింది. ఫలితాలు గురువారం వెలువడే అవకాశం ఉంది.
- Advertisement -



