Tuesday, August 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంటెట్ తప్పనిసరి నిబంధన సరికాదు

టెట్ తప్పనిసరి నిబంధన సరికాదు

- Advertisement -

ఎన్ఈపీ-2020, పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా 
ఐక్య పోరాటం
ఎస్టీఎఫ్ఐ జాతీయ కౌన్సిల్ సమావేశం తీర్మానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి నిబంధనను తొలగిస్తూ విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని, ఎన్ఈపీ-2020 రద్దు చేయాలని, పాఠశాలల విలీనం, మూసివేతకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాన్ని నిర్వహించాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) జాతీయ కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. ఎస్టీఎఫ్ఐ జాతీయ కార్యవర్గం, జాతీయ కౌన్సిల్ సమావేశాలు సీఎన్ భార్తి అధ్యక్షతన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జరిగాయి. ప్రధాన కార్యదర్శి చావ రవి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూతూ జాతీయ విద్యా విధానం అమలు కారణంగా గత ఐదేండ్లలో దేశవ్యాప్తంగా లక్ష పాఠశాలలు మూతపడ్డాయని, ప్రభుత్వ పాఠశాలల్లో రెండు కోట్ల మంది విద్యార్థులు తగ్గారని ఆందోళన వ్యక్తం చేశారు. శాశ్వత నియామకాల స్థానంలో తక్కువ వేతనాలతో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ నియామకాలు చేసి అధికారిక శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ తీర్పు 25 లక్షల మంది ఉపాధ్యాయుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విద్యా హక్కు చట్టం సెక్షన్ 23 ను సవరించి వారికి ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. ఎస్టీఎఫ్ఐ అధ్యక్షులు సీఎన్ భార్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే 8వ పే కమిషన్ నివేదికను తెప్పించుకుని 2026 జనవరి 1 నుంచి అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల ఆదాయపు పన్ను పరిమితిని సవరించాలని, విద్యా రంగంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై సెప్టెంబర్ , అక్టోబర్ నెలల్లో దేశవ్యాప్తంగా వాహన జాతాలు, ర్యాలీలు నిర్వహించాలని, టెట్ సమస్య పరిష్కారానికి అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (ఎఐ జాక్టో) సమావేశంలో చర్చించాలని సమావేశంలో నిర్ణయించా రు. జాతీయ స్థాయిలో ఐక్య కార్యాచరణను రూపొందిం చుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై తీర్మానాలను సమా వేశం ఆమోదించింది. ఈ సమావేశంలో ఎస్టీఎఫ్ఐ సంయుక్త ప్రధాన కార్యదర్శి సుజిత్ దాస్, కోశాధికారి టీకేఏ షఫీ, ఉపాధ్యక్షులు కెఎస్ఎస్ ప్రసాద్, ఎన్ వెంకటేశ్వర్లు, మహవీర్ సిహాగ్, మయిల్, కార్యద ర్శులు అరుణ కుమార్, అర్చనా బిశ్వాస్, ఎ.కె.బీనా, మయవన్, ప్రభు సింగ్, ధృవశేఖర్ మండల్, సుదీప్త గుప్త, ఓం ప్రకాష్ పాండే, ఆశిష్ చౌదరి తదితరులతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, ఉపాధ్యక్షులు సిహెచ్. దుర్గా భవాని, మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆర్.శారద, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -