- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అంటార్కిటికాలోని ఎరెబస్ అగ్నిపర్వతం ప్రతి సంవత్సరం సుమారు రూ.18.9 కోట్ల విలువైన బంగారు ధూళిని గాలిలోకి వెదజల్లుతున్నట్లు జియోఫిజికల్ పరిశోధనలు వెల్లడించాయి. 1991 నాటి సర్వే ప్రకారం, రాస్ ద్వీపం సమీపంలోని ఈ అగ్నిపర్వతం రోజుకు 80 గ్రాముల బంగారు ధూళిని విడుదల చేస్తోంది. అగ్నిపర్వత లావా నుంచి వెలువడే వాయువులు స్వచ్ఛమైన బంగారు సూక్ష్మ కణాలను 1,000 కిలోమీటర్ల వరకు మోసుకెళ్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా 60 మైక్రోమీటర్ల వ్యాసం కలిగిన ఈ బంగారు స్పటికాలను గుర్తించారు.
- Advertisement -



