Tuesday, June 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరత్నాల గనిలో విరిగిపడిన కొండచరియలు

రత్నాల గనిలో విరిగిపడిన కొండచరియలు

- Advertisement -
  • ఐదుగురు మృతి, 15 మంది గల్లంతు

నవతెలంగాణ-హైదరాబాద్: మయన్మార్‌‌లో రత్నాల గనిలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందారు. 15 మంది గల్లంతయ్యారని ప్రభుత్వ మీడియా మంగళవారం తెలిపింది. కాచిన్ రాష్ట్రంలోని హపాకాంట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి సమయంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జాడే (పచ్చ రాయి) కోసం సుమారు 20 మంది వెతుకుతున్నారు. ఆ సమయంలో వారిపై రాళ్ల కుప్ప ఒక్కసారిగా కూలిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. ఆ శిథిలాల కింద 15 మంది చిక్కుకుపోయారు అని ప్రభుత్వ మీడియా తెలిపింది. కొన్నిరోజులపాటు కురిసిన వర్షాల వల్ల అంతకుముందు తవ్విన గని వ్యర్థాల కుప్పలు కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని ‘ది గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్’ అని వార్తాపత్రిక పేర్కొంది.

వర్షా కాలంలో మయన్మార్‌ ‌గనుల్లో ఇలాంటి ప్రాణ నష్టానికి సంబంధించిన ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. పేదలు పొట్టకూటి కోసం.. మైనింగ్‌ ‌కార్యకలాపాల అనంతరం వదిలేసిన శిథిలాల నుంచి రత్నాల ముక్కలు ఏరుకుంటారు. ఇలా చిన్నాచితకా రత్నాలు ఏరుకునే పని చేస్తూనే ఎంతోమంది తమ ప్రాణాల్ని సైతం కోల్పోతున్నారని మీడియా వెల్లడించింది.
​కాగా, మయన్మార్‌‌లో భారీ స్థాయిలో నియంత్రణ లేకుండా మైనింగ్‌ ‌తవ్వకంగా జరుగుతుంటుంది. ఉత్తర కచిన్ రాష్ట్రం చైనాకు పొరుగు ఉన్న రాష్ట్రం. ప్రపంచంలోనే జేడైట్ గని అత్యధికంగా తవ్వకం ఉన్న రాష్ట్రంగా ఇది పేరుగాంచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -