- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజాగ్‌లో చిత్ర బృందం ట్రైలర్ విడుదల వేడుక నిర్వహించింది. ఇది రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్నట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.
- Advertisement -



