Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పౌర హక్కులు ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కు

పౌర హక్కులు ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కు

- Advertisement -

జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు విశ్వం బాబు,ద్యారపోగు వెంకటేష్
నవతెలంగాణ-వనపర్తి 

పౌర హక్కుల దినోత్సవం అనేది ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని, సమానత్వం స్వేచ్ఛ, న్యాయం, మానవ గౌరవం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే ఒక ముఖ్యమైన కార్యక్రమం అని వనపర్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు విశ్వం బాబు,ద్యారపోగు వెంకటేష్ అన్నారు. కొత్తకోట మండలం కానాయిపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా కానాయిపల్లి గ్రామ సర్పంచ్ శిరీష అధ్యక్షతన మంగళవారంం పౌర హక్కుల దినోత్సవం వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనపర్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చింతకుంట విశ్వం బాబు, ద్యారపోగు వెంకటేష్ పాల్గొని మాట్లాడారు. ప్రతిి పౌరుని హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు చేపట్టి హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. హక్కులు ఎలా వినియోగించుకోవాలి, దళితుల భూ సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారులను కలిసి పరిష్కరించుకోవాలని, ప్రతి దళిత బిడ్డ చదువుకోవాలని, చదువుతూనే సమాజంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉండోచ్చని వారు తెలిపారు.

ప్రజల తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తు చేశారు. యువకులు డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారన్నారు. అలాంటి  తల్లిదండ్రులు పిల్లలపైన బాధ్యత తీసుకొని డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని తెలిపారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కానాయిపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్సీ ఎస్టీల పైన ఎవరిపైన వివక్షులు చూడకూడదని ప్రతి వ్యక్తిని సమానంగా గౌరవించాలని సందేశం ఇచ్చారు.

ఎస్సీ ఎస్టీల పైన అగ్రకులాల వారు దాడులు చేసిన వారిని దూషించిన చిన్నచూపు చూస్తే వారికి కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. కులమత బేధం లేకుండా అందరిని గౌరవించడం ప్రతి పౌరుని బాధ్యత ఎస్సీ ఎస్టీల పొలం లాక్కున్న పొలంలోకి వచ్చి ఎవరన్నా దౌర్జన్యం చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని వారు అన్నారు ఉన్నత విద్యను అభ్యసించాలని అందుకు గవర్నమెంట్ అన్ని వసతులు కల్పిస్తుందని తెలియజేశారు. సోదర భావంతో కూడిన సమాజ నిర్మాణానికి మనమందరం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట ఎస్సై శివానంద్ గౌడ్, గ్రామ సెక్రెటరీ రాజు, గ్రామ పంచాయతీ ఆఫీసర్ ఉషోదయ, సోషల్ వెల్ ఫెర్ ఆఫీసర్ సంతోష్ గ్రామస్తులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -