- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఇంధన వినియోగదారులకు ఊరటనిస్తూ.. ప్రయివేటు ఇంధన సంస్థ నయారా ఎనర్జీ పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను లీటరుకు రూ.3 తగ్గించింది. బుధవారం నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా 7,000కు పైగా నయారా ఫ్యూయల్ స్టేషన్లలో ఈ ధరలు వర్తిస్తాయి. అయితే, ప్రభుత్వ రంగ సంస్థలైన IOC, BPCL, HPCL తమ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
- Advertisement -



