Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుక‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ వినియోగ‌దారుల‌కు ఊర‌ట‌..

క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ వినియోగ‌దారుల‌కు ఊర‌ట‌..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్‌ ఎల్‌పీజీ సిలిండర్ ధరను చమురు కంపేనిలు భారీగా తగ్గించాయి. ఈ ఏడాది వాణిజ్య సిలిండర్ ధర తగ్గడం ఇదే మొదటిసారి. ఇవాళ్టి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్‌పై రూ.183.50 మేర ధర తగ్గింది. దాంతో అక్కడ సిలిండర్ ధర రూ.3,113.50 నుంచి రూ.2,930కి చేరింది.

కోల్‌కతాలో రూ.174 తగ్గడంతో ధర రూ.3,081.50కి, చండీగఢ్‌లో రూ.181.50 తగ్గింపుతో రూ.2,954.50కి, పట్నాలో రూ.173 తగ్గింపుతో రూ.3,227కి ధరలు దిగివ‌చ్చాయి. అదేవిధంగా హైద‌రాబాద్‌లో రూ.176 త‌గ్గి సిలిండ‌ర్ ధ‌ర రూ.3,191కి చేరింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడమే ఈ ధరల తగ్గింపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని 60 రోజులపాటు పొడిగించడంతో చమురు ధరలు దిగివచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -