- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. ఆగిఉన్న లారీని వెనకనుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఘటనాస్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
- Advertisement -



