- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : యూరప్‌లో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ప్రజలు అల్లడిపోతున్నారు. సగటున 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా యూరప్‌లో గత పది రోజుల్లోనే 1,300 మందికిపైగా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఎండల కారణంగా సాధారణ జనజీవితం స్తంభించిపోయింది. ప్రజలు ఇండ్లల్లోంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఎండ ప్రభావానికి గురైన వారికి అత్యవసర సేవలు అందించేందుకు అక్కడి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
- Advertisement -



