Wednesday, July 1, 2026
E-PAPER
Homeజాతీయంఆర్మీ కొత్త చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు..

ఆర్మీ కొత్త చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత సైన్యం 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. ఈ నియామకం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ.. విధి, గౌరవం, దేశమే ప్రథమం అనే ఆదర్శాలకు కట్టుబడి సైన్యాన్ని నడిపిస్తానని స్పష్టం చేశారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సౌత్ బ్లాక్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తన తండ్రి, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేఎం సేథ్‌కు ఆయన సెల్యూట్ చేయడం, ఆయన సోదరుడు రియర్ అడ్మిరల్ రవ్నీశ్ సేథ్ ఆయనకు సెల్యూట్ చేయడం ప్రత్యేకంగా నిలిచింది.

ఈ సందర్భంగా జనరల్ సేథ్ మాట్లాడుతూ.. ‘విజయ్’ అనే నినాదంతో తన ప్రాధాన్యతలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో నిరంతర నిఘా, వినూత్న ఆవిష్కరణలు , వైమానిక-నౌకాదళాలతో సమన్వయం, ఆత్మనిర్భరత , సైనికుల సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యం అనే ఐదు అంశాలే తన లక్ష్యాలని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -