- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా పరిధిలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న స్లీపర్ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొని లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
- Advertisement -



