- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా సదాశివపేట జాతీయ రహదారి 65పై బైపాస్ రోడ్డులోని మూలమలుపు వద్ద శనివారం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
- Advertisement -



