నవతెలంగాణ -చిన్నకోడూరు
అక్రమ పశువుల రవాణాపై నమ్మదగిన సమాచారం మేరకు చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంనగర్ గ్రామ శివార్లలో చిన్నకోడుర్ పోలీస్ వారితో తనిఖీలు నిర్వహించగా శనివారం అక్రమంగా తరలిస్తున్న పశువులను పట్టుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నుండి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు రెండు మహీంద్రా పికప్ వాహనాల్లో పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ముందస్తు సమాచారం అందించడంతో ఈ మేరకు ఇబ్రహీంనగర్ శివార్లలో నిఘా ఉంచిన చిన్నకోడూరు పోలీసులు, రెండు వాహనాలను అడ్డగించి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 26 పశువులను (13 ఆవులు, 13 ఎడ్లు) గుర్తించారు.
ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి
శేఖర్ ముఖ్తార్ (28): జైనూర్, ఆసిఫాబాద్ నివాసి. (వాహనం నం: MH 34 BZ 9225). ఇందులో 11 ఆవులు, 5 ఎడ్లు సైరు ఖురేషీ (32): మాగమ్, ఆసిఫాబాద్ నివాసి. (వాహనం నం: MH 34 BZ 9453). ఇందులో 2 ఆవులు, 8 ఎడ్లు ఉన్నాయన్నారు. అక్రమ రవాణాకు ప్రధాన సూత్రధారి హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ ఫయాజ్ అని తెలిపారు. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న పశువులను, వాహనాలపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చిన్నకోడూరు ఎస్ ఐ చంద్రమోహన్ తెలిపారు.



