Thursday, April 16, 2026
E-PAPER
Homeజాతీయంచిలకలడోన రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు, జగన్ దిగ్భ్రాంతి

చిలకలడోన రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు, జగన్ దిగ్భ్రాంతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టెంపో వాహనం–లారీ ఢీకొన్న ఘటనలో 8 మంది మృతి చెందడంతో సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే కర్నూలు జీజీహెచ్‌కు తరలించాలని సీఎం ఆదేశించారు.
మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -