- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ శివారులో గల దుర్గ ఫుడ్ ఆయిల్ మిల్లులో తేల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. కొండాపూర్ ఎస్‌ఐ సోమేశ్వరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాపూర్ శివారులోని రోడ్డు పక్కలో గల దుర్గ ఆయిల్ మిల్లులో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చేలరేగాయన్నారు. దీంతో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపు చేసినట్లు ఎస్‌ఐ సోమేశ్వరి, సీఐ సుమన్ కుమార్ పేర్కొన్నారు.
- Advertisement -



