Monday, April 20, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్యాంగాన్ని కేంద్రం ప్రభుత్వం హైజాక్‌ చేస్తోంది: కేసి వేణుగోపాల్

రాజ్యాంగాన్ని కేంద్రం ప్రభుత్వం హైజాక్‌ చేస్తోంది: కేసి వేణుగోపాల్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం హైజాక్ చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టగా ఈ బిల్లును అనుమతించాలా వద్దా అనే దానిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీ వేణుగోపాల్ ఈ బిల్లుకు అసలు కారణం వేరే ఉందని దుయ్యబట్టారు. ప్రజాప్రాతినిధ్య చట్టానికి రక్షణగా ఉన్న చట్టాన్ని మారుస్తున్నారని విమర్శించారు. 2023 లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చామని, 2024లో 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -