నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి హుబ్లీ వెళుతున్న ఫ్లై 91 విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య ఎదురైనట్టు అధికారులు వెల్లడించారు. విమానాన్ని దారి మళ్లించాల్సిన పరిస్థితి వచ్చిందని, విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని తెలిపారు.
కాగా ఆదివారం రోజు సాంకేతిక సమస్యలవల్ల విమానం మూడు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు భయంతో బిగ్గరగా ఏడుస్తూ క్షేమంగా కిందకు దిగాలని ప్రార్థనలు చేశారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఫ్లై 91 (Fly91) బయలుదేరింది. అది 4.30 కు హుబ్లీ చేరుకోవాలి. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో దాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు తెలిపారు.



