- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్; జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. ఉత్తర జపాన్‌లో చోటుచేసుకున్న ఈ భూకంపంతో తీవ్ర ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా ప్రాణ, ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



