- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ వినియోగదారులకు షాకిచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచేసింది. రూ.859 ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ.899కు పెంచింది. వినియోగదారులకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ ధరలను సవరించింది. దీంతో ఈ ప్లాన్ను రెగ్యులర్గా రీఛార్జి చేసుకునే వినియోగదారులపై రూ.40 అదనపు భారం పడనుంది. సవరించిన ప్లాన్లో ఎటువంటి అదనపు ప్రయోజనాలు కల్పించకపోవడం గమనార్హం. మరోవైపు రోజుకు 1.5 జీబీ డేటాతో 77 రోజుల వ్యాలిడిటీ కలిగిన రూ.799 ప్లాన్ను కూడా ఎయిర్టెల్ తొలగించింది. అయితే, ఇందుకుగల కారణాలను మాత్రం ఎయిర్టెల్ వెల్లడించలేదు.
- Advertisement -



