నవతెలంగాణ – హైదరాబాద్: సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న బస్తీబాట 2వ రోజు ముషీరాబాద్ జోన్ కవాడిగూడ డివిజన్ లోని మైసమ్మ బండ బస్తీలో స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ బస్తీలో ఇండ్ల పట్టాలు, మంచినీటి కాలుష్యం, లో ప్రెషర్, మ్యాన్ హోల్స్ నిండిపోవడం, దోమలు, రోడ్డు, వీధి దీపాలు సమస్యలు ఉన్నాయి. చాలా మంది ప్రజలు 0 కరెంట్ బిల్ రావడం లేదని, రూ 500 గ్యాస్ సిలిండర్ రావడం లేదని, పెన్షన్ పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బస్తీ బాట కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ T. జ్యోతి, నగర కార్యదర్శి M. వెంకటేష్, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. శ్రీనివాసరావు, ఎం. దశరథ్, ముషీరాబాద్ జోన్ కార్యదర్శి R. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజు సీపీఐ(ఎం) బస్తీబాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



