Monday, April 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలురైఫిల్‌తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

రైఫిల్‌తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కాకినాడలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ధనరాజు హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం భద్రతా కేంద్రం వద్ద డ్యూటీలో ఉన్నారు. సోమవారం విధుల్లో ఉండగా.. 303 రైఫిల్‌తో తనపై తాను కాల్పులు జరుపుకున్నారు. కాల్పుల శబ్ధం విన్న తోటి సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న ధనరాజును కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -