Thursday, July 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలు7 కిలో మీటర్లు ఎత్తైన అడవుల నుండి ప్ర‌యాణం..వీడియో

7 కిలో మీటర్లు ఎత్తైన అడవుల నుండి ప్ర‌యాణం..వీడియో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆంద్ర‌ప్ర‌దేశ్‌లోని ఏఎస్ఆర్ (పాడేరు) జిల్లా ముంచంగిపుట్టు మండలం రంగభయలు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బుడ్డపనస,గొబ్బరిపడ,నువ్వగూడ,ఇతర గ్రామ పివిటిజి ఆదివాసీలు రోజు సుమారుగా 7 కిలో మీటర్లు చాలా ఎత్తైన అడవుల నుండి నిత్యావసర సరుకులకు,ఆరోగ్య అత్యవసర సేవలకు వెళ్ళాలంటే ఘాటి ఎక్కివెళ్లాల్సిందే.
లక్ష్మీపురంలో జరిగే బుధవారం వారపు సంత చేసి వెళుతున్నప్పుడు తీసీన వీడియోలో ఆదివాసీలు ప‌డుతున్న ఇబ్బందులు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతున్నాయి.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొర్రా త్రినాధ్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 80 సం:కావ‌స్తున్న‌ ఆదివాసీలకు రహదారి సౌకర్యం కల్పించలేకపోయిందని,అందుకు ప్రభుత్వం స్పందించి పీఎం జన్ మన్ ద్వారా మంజూరు అయి ఫారెస్ట్ అధికారుల అనుమతి నిరాకరణతో ఆగి ఉన్న రోడ్డును వెంటనే అనుమతులు క్లియరెన్స్ చేసి రోడ్డు పనులు ప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -