Saturday, July 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'శ్రీనివాస మంగాపురం'రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

‘శ్రీనివాస మంగాపురం’రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్‌ భూపతి దర్శకుడు. సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు. శుక్రవారం చిత్ర బృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రం ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు, టీజర్లు, పోస్టర్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాని సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. తన మార్క్ ఇంటెన్సిటీకి అందమైన ప్రేమకథ, పవర్‌ఫుల్ యాక్షన్‌ను జోడిస్తూ రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి రచన -దర్శకత్వం: అజయ్ భూపతి, సమర్పణ: అశ్విని దత్, నిర్మాత: పి. కిరణ్, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ : జయకృష్ణ, ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్ళపాటి, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శాకమూరి నారాయణ స్వామి, ఫైట్స్: రియల్ సతీష్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -