సంఘ్ అండతోనే అందలం రథయాత్ర రోజుల్లో అశోక్ సింఘాల్ ముఖ్య అనుచరుడు
రామజన్మభూమి ట్రస్ట్‌లో అత్యంత శక్తిమంతుడిగా ఎదిగిన తీరు
2002 నుంచే చేతివాటం ప్రదర్శన
ఫైళ్లు మోయడం తప్ప ఆయన చేసిందేమీ లేదు
చంపత్‌రాయ్‌ని ట్రస్ట్ అధిపతిగా
చేయడంపై సర్వత్రా విమర్శలు
లక్నో : అయోధ్య రామాలయం విరాళాల వివాదంలో కీలకంగా వినిపిస్తున్న పేర్లలో ఒకటి చంపత్ రాయ్. పలు వివాదాలకు కేంద్ర బిందు వుగా ఉన్న ఆయనకు సంఘ్, బీజేపీ నాయకత్వం చాలా ప్రాధాన్యతనిచ్చింది. వివాదాస్పద రామమందిర రథయాత్రలో పెద్దగా గుర్తింపు లేని కార్యకర్తగా చంపత్ రాయ్ ప్రయాణం ప్రారంభమైంది. నేడు ఆయన రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌లో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా ఉన్నాడు. అయితే అదే స్థాయిలో ఆయనపై వివా దాలు కూడా పెరిగాయి. భూముల కొనుగోళ్లు, నిర్మాణ సామగ్రి సేకరణ, ట్రస్ట్ నిధుల విని యోగం, తాజాగా రామమందిర విరాళాల దుర్వి నియోగం ఆరోపణల వరకు దాదాపు ప్రతి వివ ాదంలోనూ ఆయన పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ విచారణ ఎదుర్కొన్న చంపత్ రాయ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించినప్పటికీ.. అది ఇంకా ఆమోదం పొందలేదు.
అశోక్ సింఘాల్‌కు అత్యంత దగ్గర
1990లో బీజేపీ అగ్రనేత ఎల్.కె అద్వానీ గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి యూపీలోని అయోధ్య వరకు చేపట్టిన రథయాత్రను అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం సమస్తిపూర్‌లో అడ్డుకుని అద్వానీని అరెస్టు చేసింది. ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రధాన కార్యదర్శి అశోక్ సింఘాల్ రహస్యంగా అయోధ్య చేరుకుని శిలాపూజ నిర్వ హించారు. ఆ సమయంలో సింఘాల్‌కు అత్యంత దగ్గరగా పనిచేసిన యువ వీహెచ్‌పీ కార్యకర్త చంపత్ రాయ్. సంస్థలో ఆయన ఎదుగుద లకు సింఘాల్ ఆశ్రయం కీలకంగా మారింది. ఇద్దరూ బనియా సామాజిక వర్గానికి చెందినవారే కావడం కూడా ఆయన ఎదుగుదలకు దోహద పడింది.
నేపథ్యం
యూపీలోని బిజ్నోర్‌కు చెందిన చంపత్ రాయ్ మొదట భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా 12 సంవత్సరాలు పనిచేశాడు. 1981లో పూర్తిస్థాయి ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకుడయ్యాడు. 1986లో వీహెచ్‌పీ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ నిర్వాహక కార్యదర్శిగా నియమితుడయ్యాడు. 1991లో అయోధ్యకు వచ్చాడు. 2011లో వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి, 2018లో ఉపాధ్యక్షుడయ్యాడు. 2018లో వీహెచ్‌పీలో తొలిసారి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ప్రవీణ్ తొగాడియా వర్గం, ప్రత్యర్థి వర్గాల మధ్య తీవ్ర విభేదాల తర్వాత విష్ణు సదాశివ్ కోక్జే అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. చంపత్ రాయ్ ఉపాధ్యక్షుడయ్యాడు. ఆ సమయంలో చంపత్ రాయ్ ప్రత్యర్థి వర్గానికి నాయకత్వం వహించారని, తనను పక్కన పెట్టడంలో ఆయన పాత్ర ఉందని ప్రవీణ్ తొగాడియా కూడా అంగీకరించినట్టు విశ్లేష కులు గుర్తు చేస్తున్నారు. బజరంగ్ దళ్ వ్యవస్థాప కుడు వినయ్ కతియార్‌తో కూడా చంపత్ రాయ్‌కు విభేదాలు ఉన్నాయి.
భూముల కొనుగోళ్లపై ప్రశ్నలు
రామజన్మభూమి ఉద్యమానికి సంబంధించిన స్థానిక కార్యకర్త శ్రీవాస్తవ మాట్లాడుతూ… ట్రస్ట్‌లో సభ్యులు చాలామంది ఉన్నప్పటికీ, అసలు ట్రస్ట్‌ను నడిపేది చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలేనని అన్నారు.
గతం నుంచే వివాదాలు
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో పాల్గొన్న శివసేన మాజీ నాయకుడు సంతోష్ దూబే ప్రకారం.. దేశవ్యాప్తంగా భక్తులు పంపిన బంగారం, వెండి, వజ్రాలతో తయారైన రామశిలలు 2002లో అదృశ్యమయ్యాయని ఆరోపించారు. రామజన్మభూమి న్యాస్ అధిపతి మహంత్ పరమహంస రామచంద్రదాస్ స్వయంగా పరిశీలించినప్పుడు అవి కనిపించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని దూబే తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేయించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. రాళ్లు, నిధులు అన్నీ చంపత్ రాయ్ చేతుల్లోనే ఉన్నాయనీ, రామచంద్రదాస్ అప్పుడే చంపత్‌రాయ్‌పై అనుమానాలు వ్యక్తం చేశారని కర్పాత్రి మహారాజ్ చెప్పారు.
చంపత్ రాయ్‌కు నోటీసులు..?
రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసు నేపథ్యంలో రాజీనామా చేసిన అయోధ్య ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ షో-కాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తె లుస్తోంది. ఆలయ అధికారుల మధ్య జులై 6న జరగనున్న కీలక సమావేశంలో ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విరాళాల అవకతవకలకు సంబంధించి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని వారిని కోరనున్నట్లు తెలిపాయి. దర్యాప్తు అనంతరం వారిపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.



