Saturday, July 4, 2026
E-PAPER
Homeక్రైమ్మద్యం మత్తులో కన్న కొడుకును హత్య చేసిన తండ్రి

మద్యం మత్తులో కన్న కొడుకును హత్య చేసిన తండ్రి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో శుక్రవారం (జూలై 03) అర్ధరాత్రి కుటుంబ కలహాలు దారుణ హత్యకు దారితీశాయి. మద్యం మత్తులో తండ్రి సీతారాములు తన కుమారుడు కిరణ్ కుమార్ (35)పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చిన తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం పెరగడంతో ఈ ఘోరం జరిగింది. తీవ్రంగా గాయపడిన కిరణ్‌ను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతిని ధ్రువీకరించారు. నిందితుడు సీతారాములు పరారయ్యాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -