- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గి రూ.1,46,730కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.1,34,500గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
- Advertisement -



