Saturday, July 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబలోచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి...30 మంది పాక్‌ జవాన్లు మృతి

బలోచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి…30 మంది పాక్‌ జవాన్లు మృతి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: బలోచిస్థాన్‌లోని జివానీలో గల పాకిస్థాన్‌ కోస్ట్‌ గార్డ్‌ శిబిరంపై ఆత్మాహుతి దాడి జరిపినట్టు ప్రకటించింది. ఈ ఘటనలో 30 మంది పాక్‌ జవాన్లు మరణించినట్టు పేర్కొంది. తమ ఫైటర్స్ శిబిరంలోకి చొరబడి, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని బీఎల్‌ఏ ప్రతినిధి మీడియాకు తెలిపారు. అయితే ఈ దాడి, మృతులకు సంబంధించి పాకిస్థాన్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తమకు స్వయంప్రతిపత్తి కల్పించాలని, తమ ప్రాంతంలోని సహజవనరులపై తమకే నియంత్రణ ఉండాలని బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని వేర్పాటువాద గ్రూపు బీఎల్‌ఏ దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యం లో తరచూ సైనిక, పారామిలిటరీ, ఇతర ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది. దీనిని పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థగా ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -