నవతెలంగాణ-హైదరాబాద్: బిహార్‌లోని సాహెబ్‌గంజ్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజుకుమార్ సింగ్‌కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. 2019 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగిన ఫైరింగ్‌లో డాక్టర్ అర్చనా గుప్తా మృతిచెందిన కేసులో ఆయన్ను దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది న్యాయస్థానం. ఈ కేసులో ఆయనకు జైలుశిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది.
కేసు నేపథ్యం..
2018 డిసెంబరు 31న అర్ధరాత్రి ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ ప్రాంతంలో రాజుకుమార్ సింగ్ ఫామ్‌హౌస్‌లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో ఆయన గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ టైమ్‌లో అక్కడే ఉన్న డాక్టర్ అర్చనా గుప్తా(45) తలకు బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారామె. నాలుగేళ్ల జైలుశిక్షతో పాటు 25 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పు రాజుకుమార్ సింగ్ రాజకీయ భవిష్యత్తుపై ఏమేర ప్రభావం చూపుతుందనే విషయం చర్చనీయాంశమైంది.


