Sunday, July 5, 2026
E-PAPER
Homeక్రైమ్కారును ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి

కారును ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్ : నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నట్లు సమాచారం. కారు చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -